మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థినుల ఆందోళన

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్:  కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ వసతి గృహంలో మౌలిక వసతులు పంపించాలని విద్యార్థినిలు గురువారం ఆందోళన చేపట్టారు.ఉపకులపతి ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. హాస్టల్లో మంచినీరు, మరుగుదొడ్లు సరిగా లేవని, క్యాంపస్ లో పాములు తిరుగుతున్నాయని, ఎలుకలు, కుక్కలు కరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఆందోళన చేస్తున్నా వీసీ (ఉపకులపతి) పట్టించుకోవడం లేదని, సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram