జెన్పాక్ట్ సంస్థలో నియమితులైన పింగిళి కళాశాల విద్యార్థినులను అభినందించిన హనుమకొండ కలెక్టర్ పి. ప్రావిణ్య ఐఏఎస్!ప్రొఫసర్ బి చంద్రమౌళి
గోల్డెన్ న్యూస్ / హనుమకొండ : పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి) హనుమకొండలో కామర్స్, వ్యాపార నిర్వహణ శాస్త్ర విభాగం మరియు తెలంగాణ స్కీల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రముఖ కార్పోరేట్ సంస్థ జెన్ ప్యాక్ లో ఇటీవల నియమితులైన 18 మంది విద్యార్థులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ పి. ప్రావీణ్య ఐఏఎస్ అభినందనందించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి ఒక ప్రకటన లో తెలియజేసినాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి చంద్రమౌళి, కామర్స్ విభాగాధిపతి డాక్టర్ ఏ సారంగపాణి, టీఎస్ కేసి కోఆర్డినేటర్ పిడి సుజాత, నియమితులైన విద్యార్థులతో కలసి హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయములో జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ అయినా పి. ప్రావీణ్య ఐఏఎస్ ను నిన్న సాయంత్రం మర్యాద పూర్వకంగా కలసినారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కలెక్టర్ పి ప్రావిణ్య ఐఏఎస్ మాట్లాడుతూ ఈ నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగాలని పింగిళి కళాశాల డిగ్రీ విద్యార్థినిలు మిగతా విద్యార్థినులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని సూచిస్తు,ఈ నియామకాలు పింగిళి కళాశాల యొక్క పేరు ప్రతిష్టతలను మరియు మీ తల్లిదండ్రుల పేర్లను పెంచే విదంగా ఉందని తెలిపినారు.నియామకం పొందిన స్టూడెంట్స్ అభినంచారు. సెలక్షన్ పొందిన విధానం, ట్రైనింగ్ వివరాలు, వర్క్ నేచర్, పనివేళలను, జీతభాత్యాలను అడిగి తెలుసు కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వి సుమలత, డాక్టర్ పి సురేష్ మరియు మొహమ్మద్ రఫీ మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.