యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం.

గోల్డెన్ న్యూస్ / కరీంనగర్ : కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం గోదాంలో గురువారం రాత్రి మంటలు వ్యాపించి సమాధాన పత్రాలు పూర్తిగా కాలిపోయాయి. గురువారం యూనివర్సిటీ ఆవరణలోని చెట్లకు మంటలు అంటుకోగా అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేశారు. గురువారం రాత్రి నిప్పు రవ్వలు ఏసీ పైపుల ద్వారా గోదాంలోకి వ్యాపించడంతో పరీక్షా పత్రాలు దగ్ధం అయ్యాయి. ఉదయం గోదాం నుంచి పొగ రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ రోజు ఉదయం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు.

 

పరీక్ష పేపర్లు 2020- 22 సంవత్సరానికి చెందినవి ఉండడంతో పెద్దగా నష్టమేమీ జరగలేదని యూనివర్సి అధికారులు తెలిపారు..

Facebook
WhatsApp
Twitter
Telegram