యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

గోల్డెన్ న్యూస్/ నల్గొండ : నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో  భారీ అగ్నిప్రమాదం జరిగింది. పవర్‌ ప్లాంట్‌ మొదటి యూనిట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం మొదటి యూనిట్‌లోని బాయిలర్‌ నుంచి ఆయిల్‌ లీక్‌ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్‌ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి యూనిట్‌ మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతుండగా ప్రమాదం చోటుచేసుకోవడం  గమనార్హం

Facebook
WhatsApp
Twitter
Telegram