గోల్డెన్ న్యూస్ / పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్లో దారుణ హత్య జరిగింది. స్థానికంగా నివసించే పొలం కుమార్ (40) అనే వ్యక్తిని అప్పన్నపేటకు చెందిన ఓ యువకుడు కత్తితో గొంతు కోసి చంపాడు.ప్రాథమిక సమాచారం మేరకు, ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Post Views: 43