గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శామీర్ పేట రక్షక భట నిలయంలో సోమవారం తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన జరిగింది. ఫిర్యాదుదారుని మరియు అతని సేవకుని పేర్లను నమోదైన కేసులో నిందితులుగా చేర్చకుండా ఉండటానికి, అలాగే మొబైల్ ఫోన్ను తిరిగి ఇవ్వడానికి ఫిర్యాదుదారుని నుండి రూ.22,000/- లంచం తీసుకుంటూ శామీర్ పేట పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. ఎం. పరుశురామ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఇంకా, అప్పటికే సదరు ఎస్.ఐ. ఫిర్యాదుదారుని నుండి రూ.2,00,000/- కూడా వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ, ఎస్.ఐ. పై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
>
Post Views: 32