ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ATMలలో రూ.200, రూ100 నోట్లే.

భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదు ఉపసంహరణ వ్యవస్థలో కీలక మార్పుకు తెరతీసింది  సెప్టెంబర్ 2025 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 75 శాతం ATMలలో ప్రధానంగా రూ.100 మరియు రూ.200 నోట్లను మాత్రమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది.

 

ఆర్బిఐ మార్పుకు ఇదే నా కారణం ?

 

RBI నిర్ణయం వెనుక అసలు ఉద్దేశ్యం పెద్ద నోట్లపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమేనని నిపుణులు భావిస్తున్నారు. గతంలో రూ.2000 నోటును చెలామణి నుంచి పూర్తిగా తొలగించిన RBI, ఇప్పుడు రూ.500 నోటు సరఫరాపైనా నియంత్రణకు ప్రణాళిక వేసిందనే ఊహాగానాలు వెల్లివిరుస్తున్నాయి. దీని ద్వారా చిన్న నోట్ల చలామణిని పెంచి, నగదు లావాదేవీలను మరింత పారదర్శకంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

నిపుణుల అభిప్రాయాలు

 

వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వని రాణా ఈ అంశంపై స్పందిస్తూ, ATMలలో చిన్న నోట్లపై ఆధారపడే విధంగా మార్చడమే ఆర్బీఐ లక్ష్యమన్నారు. ఆయన పేర్కొన్నది ఏమంటే, “పెద్ద నోట్ల అవసరాన్ని తగ్గించడం వల్ల నకిలీ నోట్ల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. అలాగే ముద్రణ ఖర్చు తగ్గుతుంది.”

 

రాజకీయ మరియు ఆర్థిక ప్రభావం

 

ఇందులో మరొక ముఖ్యమైన కోణం – డిజిటల్ కరెన్సీ ప్రవేశం. దేశవ్యాప్తంగా UPI, NEFT, IMPS వంటి డిజిటల్ లావాదేవీలు విస్తృతంగా ప్రాచలించడంతో, నగదు అవసరం గతంతో పోల్చితే తక్కువైంది. ఈ క్రమంలో, డిజిటల్ రూపాయి (e-Rupee) వంటి కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టడానికి RBI సిద్ధమవుతోంది. దీనివల్ల ప్రభుత్వం నోట్ల ముద్రణపై ఖర్చు చేయాల్సిన భారం తగ్గుతుంది.

 

 

రూ.500 నువ్వు రద్దు కానుందా?

 

రూ.500 నోటు రద్దు కానుందా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకపోయినా, ఆ దిశగా సూచనలు కనిపిస్తున్నాయని రాణా అభిప్రాయపడ్డారు. రూ.2000 నోటును తొలగించిన విధంగా, రూ.500 నోటును కూడా క్రమంగా చలామణి నుంచి తీయవచ్చని చెప్పారు. దీనికి అధికారిక ప్రకటన కోసం మాత్రం ఇంకా వేచి చూడాల్సిందే.

 

RBI తీసుకున్న ఈ కీలక నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన దశగా భావించబడుతోంది. చిన్న నోట్ల ప్రాధాన్యం పెరగడం, డిజిటలైజేషన్ వేగం పుంజుకోవడం, పెద్ద నోట్లపై ఆధారపడే పరిస్థితుల నుంచి బయటపడటానికి ఇది ఒక మైలురాయి కావచ్చు.

Facebook
WhatsApp
Twitter
Telegram