ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి..
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని పేర్కొన్నది. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీజేసినట్టు తెలిపింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. రాష్ట్రంలో మూడ్రోజులు పలు జిల్లాలో వడగండ్ల వాన కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు.