పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఘటన కరకగూడెం మండలంలో చోటుచేసుకుంది. అనంతరం గ్రామానికి చెందిన కొప్పుల సతీష్  (34)  అను వ్యక్తి మద్యం మత్తులో మంగళవారం రాత్రి గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతని  వైద్యం కోసం వరంగల్ జిల్లాలోని MGM ఆస్పత్రికి తరలిస్తుండగా  దారిలో పరిస్థితి విషమించి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ వైద్యం పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు కరకగూడెం ఎస్ఐ PVN.రావు  కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram