జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ వీరమరణం

గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్ : ఆపరేషన్ సిందూర్ తో భారత్  పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అంతేగాకుండా పాక్ దాడులను భారత్ తిప్పి కొడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎల్ వో సి వెంబటి  నిత్యం కాల్పులకు తెగబడుతోంది. సామాన్య పౌరులే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. అయితే పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా  తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ కాల్పుల్లో భారత జవాన్ మురళీనాయక్‌ వీరమరణం పొందాడు ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా కల్లి తండా. రేపు మురళీనాయక్‌ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు స్వగ్రామానికి తీసుకు రానున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram