రేపు భారత్ -పాకిస్తాన్ తొలి సమావేశం

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : భారత్ -పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రేపు జరగ నున్న ఇరుదేశాల తొలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొ న్నప్పటికీ, ఇరు దేశాల మధ్య జరగనున్న తొలి శాంతి చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి. అయితే, ఈ చర్చలు ప్రస్తుతానికి కేవలం కాల్పుల విరమణకు మాత్రమే పరిమితం కానున్నాయి. ఇతర ముఖ్యమైన అంశాలపై తదుపరి దశలో చర్చలు జరిగే అవకాశం ఉంది.

 

భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. రక్షణ బలగాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూ నే, వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. పాకిస్తాన్ ఒకవేళ దాడులకు పాల్ప డితే, వాటికి దీటుగా ప్రతిదాడులు చేయాలని భారత రక్షణ బలగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

 

మరోవైపు, వీసాల రద్దు , సింధు జలాల ఒప్పందం రద్దు వంటి ఆంక్షలు కొనసా గనున్నాయి. రాబోయే రోజుల్లో భారత్ మరిన్ని ఆంక్షలను చర్చల ద్వారా పాకిస్తాన్‌పై విధించే అవకాశం ఉంది.

 

పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు స్వఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదన చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన పరిణామాల్లో పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించు కుంది. భారత వైమానిక దాడుల్లో 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

 

ప్రతిదాడుల్లో పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా తీవ్రంగా నష్టపోయాయి. పాక్ ఆక్ర మిత కాశ్మీర్‌లోని 9 తీ వ్రవాద స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది. భారత వైమానిక మెరుపు దాడుల్లో ఐదుగురు కరుడు గట్టిన తీవ్రవాదులు హత మయ్యారు.సైనికపరంగా పాకిస్తాన్ ఊహించని స్థాయిలో నష్టపోయింది.

 

అమెరికా మధ్యవర్తిత్వం , అంతర్జాతీయ ద్రవ్య నిధి ద్వారా పాకిస్తాన్‌కు 1 బిలియన్ డాలర్ల రుణ మంజూరు వంటి అంశాలు కూడా పొరుగు దేశంపై ఒత్తిడి తెచ్చాయి. అంత ర్జాతీయంగా ఒంటరిగా మారిన పాకిస్తాన్‌కు ప్రపంచ దేశాల నుండి మద్దతు కరువైంది.

 

సైనిక చర్యలను నిలుపు దల చేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్న తర్వాత, చైనా పాకిస్తాన్ యొక్క సార్వభౌమాధి కారాన్ని కాపాడుతామని ప్రకటన చేయడం విశేషం. మరింత నష్టపోకుండా ముందు జాగ్రత్త పడిన పాకిస్తాన్, చర్చల ద్వారా శాంతికి చేతులు చాచింది.

Facebook
WhatsApp
Twitter
Telegram