స్కూల్ బస్సుకు ఫిట్నెస్ తప్పనిసరి .

 జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ.

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని వివిధ పాఠశాలల బస్సుల డ్రైవర్లకు బస్సు ఫిట్నెస్, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి డ్రైవర్ వాహనం నడిపే ముందు ఫిట్నెస్ చెక్ చేసిన తర్వాతే విద్యార్థులను బస్సులలోకి ఆహ్వానించాలని, ప్రతి వాహనానికి అటెండెంట్ తప్పనిసరిగా ఉండాలని, ప్రతి నెల డ్రైవరు తమ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని,చట్ట ప్రకారం నడుచుకోవాలని, పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లు బాధ్యతగా మెలగాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల బస్సు పాటించవలసిన నియమాల గురించి కరపత్రాలు విడుదల చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram