నిబంధనలు ఉల్లంఘించిన స్వేచ్ఛ ఆసుపత్రి పై చర్యలు.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆరోగ్యశాఖ తనిఖీ బృందాలు గురువారం సాధారణ ఆరోగ్య సౌకర్యాల ఆడిట్లో భాగంగా కొత్తగూడెంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ U. తేజశ్రీ,CHO శ్రీ సిహెచ్. నాగభూషణం, డిప్యూటీ డెమో ఎండీ ఫైజ్మెహియుద్దీన్ తనిఖీ నిర్వహించగా, కొత్తగూడెంలోని స్వేచ్ఛ ఆసుపత్రిలో అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారించుకుని ధృవీకరణ తర్వాత, ఆసుపత్రి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భంగా స్వేచ్ఛ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని సీజ్ చేశారు . ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎల్. భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిబంధనలు పాటించని అన్ని క్లినికల్ సంస్థలకు కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.