గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : భారతదేశంలోని ప్రముఖ రైడ్-యాప్ రాపిడో, మరో 11 కొత్త నగరాల్లో బైక్, టాక్సీ, ఆటో సేవలను ప్రారంభించింది.దీంతో తెలంగాణలోని మహబూబ్నగర్, సంగారెడ్డి, సిద్ధిపేట, నల్గొండ, కామారెడ్డి, రామగుండం, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్, భువనగిరిలో సేవలు ప్రారంభమయ్యాయి. దీతో లోకల్ యువతకు ఉపాధి లభిస్తుందని సంస్థ పేర్కొంది. దేశంలో 500 నగరాలకు సేవలను విస్తరించాలనేది తమ లక్ష్యమని రాపిడో కో ఫౌండర్ పవన్ గుంటుపల్లి తెలిపారు.తెలంగాణలో రాపిడో సేవలను ప్రవేశపెట్టడం పట్ల తాము సంతోషిస్తున్నామనీ, సురక్షిత, సౌకర్యవంతమైన రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యం అన్నారు.దీనివల్ల వందలాది మంది స్థానిక యువతకు జీవనోపాధి అవకాశాలు లభించి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుంది అని వారు అన్నారు.
Post Views: 37