ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం

పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ జితీష్ వి పాటిల్ మగబిడ్డకు జన్మనిచ్చారు.

 

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి లో జిల్లా కలెక్టర్ నితేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ జితేష్ వి పాటిల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లొనే పరీక్షలు చేయించుకుంటున్న ఆమె బుధవారం పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేరారు.సి హెచ్ ఎస్ డాక్టర్. రవిబాబు ఆధ్వర్యంలో వైద్యులు మగబిడ్డకు పురుడు పోసారు.ప్రభుత్వ వైద్యం పై నమ్మకం పెంచిన కలెక్టర్ చర్య.కార్పొరేట్, ఇతర పెద్ద ఆసుపత్రులను వదిలి కేవలం సి హెచ్ సి లో కాన్పు చేయించుకోవడం. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి కలెక్టర్ తన సతీమణికి క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు జరిపించడం, ఇక్కడే కాన్పు చేయించడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram