అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సాధించాలి.
ఎస్ పి రోహిత్ రాజ్ కు వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు
గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : మణుగూరులో వరుస దొంగతనాలతో కార్మికులు,ప్రజలు హడలెత్తిపోతున్నారని వెంటనే పోలీస్ శాఖ సమర్థత చర్యలు చేపట్టాలని, అలాగే అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని ప్రజలకు, కార్మికులకు, కార్మిక వార్డులకు భరోసా కల్పించాలని కోరుతూ, సామాజిక కార్యకర్త బుధవారం జిల్లా ఎస్ పి రోహిత్ రాజ్ గారికి కి వినతిపత్రం అందజేసినట్లు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు. పివి కాలనీలో సుమారు ఏడు క్వార్టర్లలో దొంగలు హల్ చల్ చేశారనీ,బంగారం వెండి ఆభరణాలతో పాటు నగదు లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని,ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని పోలీసు శాఖ చోరీ జరిగిన క్వార్టర్లను క్లూస్ టీం తో సందర్శించి ఆధారాలను సేకరించడంతోపాటు బాధితులకు కూడా ధైర్యం చెప్పాలని కోరారు. అలాగే విలువైన వస్తువులు కోల్పోయిన కార్మికులకు న్యాయం చేయాలన్నారు.చోరీకి సొత్తు రికవరీచేసి బాధితులకు న్యాయం చేసే విధంగా యాజమాన్యం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చూడాలనీ, సంతతో పాటు ఇతర ప్రధాన సెంటర్ లలో సీసీ కెమెరాలు విస్తృత పరిచి, పటిష్టమైన ఫెన్సింగ్ నిర్మించి,
కార్మిక వాడలను సందర్శించే వారికీ సింగరేణి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలనీ, సింగరేణి సెక్యూరిటీ విభాగం సమన్వయంతో కాలనీలో పెట్రోలింగ్ నిర్వహించాలనీ , పివి కాలనీలోని పోలీస్ కంట్రోల్ రూమ్ పునరుద్ధరించాలనీ, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టాలని బాబురావు ఎస్పీకి
వినతి చేశారు.