ప్రియుడితో పారిపోయేందుకు వేరే వ్యక్తిని చంపి.. తన చీర, పట్టీలు తొడిగి శవాన్ని కాల్చి తాను చనిపోయినట్లు నమ్మించిన వివాహిత.
దృశ్యం సినిమాలో తన కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైన వ్యక్తి శవాన్ని మాయం చేస్తాడు హీరో.తన ఇంటి ఆవరణలోనే పాతి పెట్టిన శవాన్ని రాత్రికి రాత్రే నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తరలిస్తాడు.తీరా పోలీసులు శవం కోసం హీరో ఇంటి వద్ద తవ్వితే అక్కడ ఓ దూడ కళేబరం బయటపడుతుంది. కానీ అక్కడ మనిషినే మార్చారు.అక్కడితో మళ్లీ సస్పెన్స్ మొదలు.. సరిగ్గా ఇలాంటి సీన్ గుజరాత్ రాష్ట్రంలోని – జఖోట్రాలో జరిగింది ఓ వివాహిత గీతా అహిర్ (22)కు భరత్ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడి, పారిపోవాలని అనుకున్నారు
ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్ సోలంకీ(56) అనే వ్యక్తిని చంపి.. మృతదేహానికి వివాహిత గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు. సరిగ్గా ఇక్కడ కూడా వారు దేనికోసం తవ్వారో అది కనపడలేదు. షాకవడం పోలీసుల వంతు అయింది.
ఆ కాలిన శవం చూసిన భర్త గీతా శవమేనని భావించగా..పోలీసుల విచారణలో అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది.
విచారణ జరిపిన పోలీసులు భరత్, గీతాను అరెస్టు చేశారు.