నిజాయితీ చాటుకున్న బాలుడు

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు .మహ్మద్ యాసిన్ అనే బాలుడికి రోడ్డుపై  50 వేల రూపాయలు దొరికినవి అతను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ డబ్బును పోలీసు అధికారికి ఇచ్చి నాకు ఈ డబ్బు రోడ్డుపై దొరికింది దీని యజమాని ఎవరో కనుగొని దానిని తిరిగి వారికి ఇవ్వండి” అని అన్నాడు  దానికి పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదని అడిగాడు అంటే దానికి యాసిన్ ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు నాది కాదని దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలనని బదులిచ్చారు..

అతని నిజాయితీని మెచ్చిన పోలీసు అధికారి నీకు నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పమని యాసిన్‌ ను అడిగారు వెంటనే యాసిన్ నాకు సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు.వెంటనే పోలీసులు ఈ విషయం సూపర్ స్టార్ రజనీకాంత్‌ కు తెలియజేయగా అందుకు స్పందించిన రజనీ కాంత్ యాసిన్‌ ను తన వద్దకు తీసుకు రమ్మని తెలిపారు

ఈ సందర్బంగా రజనీకాంత్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఈ పిల్లవాడి చదువు ఖర్చులన్నింటినీ తాను భరిస్తానని వాగ్దానం చేశాడు అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల కళాశాలలో చదువు కోవచ్చని తెలిపారు  ఇప్పటి నుండి నేను ఈ బిడ్డను నా సొంత కొడుకులా చూసుకుంటానన్నారు

నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది, కులం మరియు మతం ద్వారా కాదని సూపర్ స్టార్ రజనీకాంత్‌ అన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram