గోల్డెన్ న్యూస్ /చత్తీస్ ఘడ్: బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం మరో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఎన్కౌం టర్లో పలువురు మావో యిస్టులు మృతి చెందినట్లు సమాచారం. జిల్లాలో విస్త రించిన నేషనల్ పార్క్లో కాల్పులు కొనసాగుతూ న్నాయి.
నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు.. ఆ ప్రాంతానికి చేరుకొని కూంబింగ్ చేపట్టాయి.
ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రత బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. అవి ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి.
వారిలో అగ్రనేత ఉన్నట్లు సమాచారం ఈ ఘటన స్థలంలో అగ్రనేత మృత దేహంతోపాటు కొన్ని ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది మార్చినాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేదుకు ఆపరేషన్ కగార్ పేరుతో వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తోంది.