పోలీసు వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు

సుక్మ జిల్లాలో పోలీసు వాహనాన్ని పేల్చేసిన  మావోయిస్టులు.

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసు వాహనాన్ని మావోయిస్టులు పేల్చేయడం తీవ్ర కలకలం రేపింది.  దాదాపు వారి ఉనికే ప్రశ్నార్థకమైందంటూ వార్తలు వస్తున్న తరుణంలో ..సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు ఊహించిన షాక్ ఇచ్చారు. ఇవాళ ఉదయం ఏకంగా కూబింగ్ ఆపరేషన్ చేపడుతోన్న పోలీసు వాహనాన్ని బ్లాస్ట్ చేశారు. ఈ దుశ్చర్యలో ఎస్పీ ఆకాశ్ రావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా డీఎస్పీతో పాటు మరో సీఐకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన తోటి భద్రతా సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram