గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ లో భారీ అగ్ని ప్రమాదం సంభవిం చింది. ద్వారకా ప్రాంతం లోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ లోని ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతు న్నాయి.
సంఘటన స్థలానికి 8 అగ్గిమాపక యంత్రాలు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తు న్నాయి.ఈ మంటలో ముగ్గురు చిన్నారులు చిక్కుకున్నట్టు సమాచారం
అగ్నిప్రమాదంతో భయాం దోళనకు గురైన అపార్ట్మెం ట్ వాసులు ప్రాణాలను కాపాడుకునేందుకు పరు గులు తీశారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు భవనం పై నుంచి కిందపడిపోయి నట్లు తెలిసింది.
వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, పలువురు నివాసితులు ఈ మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఎనిమిది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు.
భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయ త్నిస్తున్నారు. అగ్నిప్రమాదా నికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.