గోల్డెన్ న్యూస్ /నిజామాబాద్ : ఏటీఎంలో పెట్టాల్సిన రూ.40 లక్షల 50 వేల నగదుతో ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగి రమాకాంత్ శనివారం డబ్బు తో పారిపోయాడు. నిజామాబాద్ జిల్లాలోని ఏటీఎంలలో నగదు పెట్టే హిటాచీ క్యాష్ ఏజెన్సీకి హైదరాబాద్ నుంచి డబ్బు రాగా.. ఆర్మూర్, నిజామాబాద్ ఏరియాలకు వాహనాల్లో క్యాష్ పంపించారు.బోధన్ ఏరియాకు నగదు చేరవేయాల్సిన బాధ్యత రమాకాంత్ ది కాగా, ఎల్లమ్మగుట్టలోని కార్యాలయంలో ఎవరూ లేని విషయం తెలుసుకొని, నగదు బ్యాగ్‌ను బైక్ పై పెట్టుకొని పారిపోయాడు పోయాడు. ఈ ఘటనపై 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Post Views: 18