అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వాలి: సీఐ

ఆదివాసి గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన పోలీసులు

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సురేష్ అన్నారు. మంగళవారం మండలంలో సింగారం, వెంకటాపురం వలస ఆదివాసి గ్రామాన్ని టేకులపల్లి సీఐ సురేష్, సురేష్. ఆళ్లపల్లి ఎస్ఐ సోమేశ్వర్  సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆదివాసులతో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొత్త వ్యక్తులకు ఆశయం వద్దని  కర్రెగుటల్లో వరుస ఎన్కౌంటర్లు జరిగిన సందర్భంగా మావోయిస్టులు చత్తీస్గఢ్ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తల దాచుకునేందుకు జిల్లాలో సంచరించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందున మావోయిస్టు సానుభూతిపరులు అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోపంగా ఉంచబడతాయని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram