దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్‌ : దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది . మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ అడ్డగుట్టలో సుష్మ(27) నివాసముంటోంది. బుధవారం హైటెక్‌ సిటీలోని ఆఫీస్‌కి పని నిమిత్తం ఆమె వెళ్లింది. రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆఫీస్‌ మేనేజర్‌కు తండ్రి అంజయ్య కాల్‌ చేశారు. రాత్రి 10.30 గంటలకే ఆమె బయల్దేరినట్లు మేనేజర్‌ తెలిపారు.

కుమార్తె కనిపించడం లేదంటూ ఉదయం 4 గంటలకు మాదాపూర్‌ పీఎస్‌లో అంజయ్య ఫిర్యాదు చేశారు. దుర్గంచెరువులో మృతదేహం తేలియాడుతోందని గురువారం ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహం సుష్మదిగా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు విచారిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram