తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు.

నకిలీ వైద్యులపై త్వరలో పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి.

మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మెన్ శ్రీనివాస్, ఐఏంఏ అధ్యక్షుడు చందర్

గోల్డెన్ న్యూస్ / సిద్దిపేట : పట్టణంలో  వైద్యులుగా చలామణి అవుతూ అర్హతకు మించి ప్రజలకు వైద్యం అందిస్తున్న నలుగురు వైద్యులను తమ తనిఖీల్లో గుర్తించడం జరిగిందని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మెన్ డాక్టర్ జి శ్రీనివాస్, సిద్దిపేట ఐఏంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్ తెలిపారు. సిద్దిపేటలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను తెంలగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ సంధర్బంగా సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిద్దిపేట ఐఏంఏ వైద్యుడు డాక్టర్ చందర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ గణేష్వానిశెట్టి, ట్రెజరర్ డాక్టర్ ప్రణీత్, డాక్టర్ శ్రీనివాస్ లతో కలిసి వైస్ చైర్మెన్ డా. శ్రీని వాస్ మాట్లాడుతూ.. సిద్దిపే ట పట్టణంలో 20 ఆసు పత్రులలో తనిఖీలు నిర్వహించామన్నారు. పట్టణంలోని ప్రసాద్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, భార్గవి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, సాత్విక ఫస్ట్ ఎయిడ్ సెంటర్, రాజరాజేశ్వరి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఈ నాలుగు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో అర్హతకు మించి వైద్యం చేస్తున్నారు. గతంలో కాంపౌండర్గా పనిచేసి డాక్టర్లుగా అవతారం ఎత్తి అధిక మోతాదులో యాంటీ బాటిక్ మందులు, స్టెరాయిడ్స్ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. త్వరలో వీరిపై పోలీ సు స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకున్న ఆసుపత్రులలో అర్హత కలిగిన వైద్యులు మాత్రమే ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. సమావేశంలో ఐఏంఏ అధ్యక్షు డు డాక్టర్ చందర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ గణేష్ వెనిశెట్టి, ట్రెజరర్ డాక్టర్ ప్రణీత్, డాక్టర్ సముద్రాల శ్రీనివాస్, డాక్టర్ సతీష్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram