టాయిలెట్లు నిర్మించాలని వినతిపత్రం.

గోల్డెన్ న్యూస్/కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ మంజూరు చేయాలని వినతి పత్రం అందజేసిన ఆటో యూనియన్ సభ్యులు.  అను నిత్యం రద్దీగా ఉండే కరకగూడెం మండల కేంద్రంలో ప్రయాణికులకు,వాహనదారులకు,ప్రజలకు మూత్ర విసర్జన లేక ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే పబ్లిక్ టాయిలెట్స్ మంజూరు చేయాలని కరకగూడెం ఆటో యూనియన్ సభ్యులు మంగళవారం ఎంపీడీవో దేవ వర కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించి ఎంపీడీవో వెంటనే పబ్లిక్ టాయిలెట్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొమరం సాంబశివరావు,గుడ్ల రంజిత్, ఇలియాజ్,కొమరం శ్రీకాంత్, ముత్యాల మధు,సిద్ధి వినయ్,సతీష్, కణితి రాము తదితరులు పాల్లోన్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram