స్నేహితునికి అండగా బాల్యమిత్రులు : ఆర్థిక సహాయం అందజేత.

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రులు తమ స్నేహితుడు ఇర్ప నాగేంద్రబాబు మాతృమూర్తి లక్ష్మి ఇటీవల మృతి చెందగా బుధవారం తమ చిన్ననాటి స్నేహితులు లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన ఇర్ప నాగేంద్రబాబు మాతృమూర్తి  మృతిచెందింది.విషయం తెలుసుకున్న తన పదో తరగతి ‌(2019-2020) బ్యాచ్‌ కరకగూడెం(చిరుమల్ల)గిరిజన ఉన్నత ఆశ్రమ పాఠశాల 10వ తరగతి విద్యార్థులు నాగేంద్రబాబు కుటుంబాన్ని పరామర్శించి,రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చిన్న వయసులో మిత్రుడి తల్లిని కోల్పోవడం  బాధాకరమన్నారు.తన స్నేహితుడు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని బాల్యమిత్రులు తెలిపారు.

అదే విధంగా తమ గ్రామానికి చెందిన క్రీడాకారులు కూడా రూ.3500 ఆర్థిక సహాయం అందజేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram