కలెక్టర్లు వారంలో రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలి – సీఎం

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై బుధవారం ఐసీసీసీలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది విద్యార్థులు చేరినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను పాఠశాలల్లో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని, సోలార్ కిచెన్లు ఏర్పాటుపై తక్షణం దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు తెలియజేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram