మార్కులు తక్కువ వచ్చినందుకు కూతుర్ని కొట్టి చంపిన తండ్రి

 

మహారాష్ట్ర సంగళీ జిల్లా నెలకరంజి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని కొట్టి చంపాడు కన్న కూతురిని కొట్టి చంపాడు తండ్రి.

17ఏళ్ల సాధన భోంస్లే డాక్టర్ కావాలని కలలు కన్నది. తండ్రి ధోండిరం భోంస్లే ప్రిన్సిపాల్ కాగా చదువు ఒత్తిడి ఎక్కువగానే ఉండేది. సాధనకు పదో తరగతిలో 93శాతం మార్కులు వచ్చాయి. దీంతో నీట్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే నీట్ ప్రాక్టీస్ టెస్ట్‌లో తండ్రి అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో మార్కులు ఎందుకు తగ్గాయనగా..

తండ్రికి చదువులోని లోపాలను ఎత్తి చూపింది సాధన. దీంతో కోపంతో చెక్కతో తల మీద బాదాడు. తల్లి, అన్న అడ్డుపడినా చితకబాదాడు.

స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడి గా పనిచేస్తున్నధోండిరామ్ భోసలే తన కుమార్తె డాక్టర్ కావాలని కోరుకున్నాడు.

బాలిక తల్లి ఫిర్యాదుతో తండ్రిని అరెస్టు చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram