హైదరాబాద్లో విస్తుపోయే దందా.. డబ్బు కోసం ఆన్లైన్లో నగ్న వీడియోల విక్రయం

హైదరాబాద్ అంబర్‌పేటలో నగ్న వీడియోల దందా గుట్టురట్టు.

ఆన్‌లైన్‌లో న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తూ విక్రయిస్తున్న జంట‌.

డబ్బులు చెల్లించిన వారికి వీడియో లింకులు పంపుతున్న వైనం.

టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో పట్టుబడ్డ భార్యాభర్తలు.

నిందితుల నుంచి కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనం.

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : (నేర విభాగం) నగరంలోని అంబర్‌పేటలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ వేదికగా సొంత నగ్న వీడియోలను చిత్రీకరించి, వాటిని విక్రయిస్తున్న ఓ జంటను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సమాజంలో నైతిక విలువలకు తూట్లు పొడుస్తూ సాగుతున్న ఈ అశ్లీల దందా స్థానికంగా కలకలం రేపింది.

 

వివరాల్లోకి వెళితే… అంబర్‌పేటకు చెందిన దంపతులు కొంతకాలంగా ఆన్‌లైన్‌లో తమ నగ్న వీడియోలను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. డబ్బులు చెల్లించిన వారికి ప్రత్యేకంగా స్ట్రీమింగ్ లింకులను, వీడియోలను పంపుతున్నారని టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా, గురువారం పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుల నివాసంపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

 

ఈ దందా కోసం ఉపయోగిస్తున్న కెమెరా, లైవ్ లింక్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన దంపతులను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ దందా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎంతకాలంగా ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram