♦ ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
♦. ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు.
♦. వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ.
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : పేదలకు సేవ చేయడంలోనే నిజమైన తృప్తి ఉంటుందని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.గురువారం ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడ్ వలస ఆదివాసీ గ్రామంలో ఏర్పాటు చేసిన దోమతెరల పంపిణీ కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలోని సుమారు 50 కుటుంబాలకు దోమ తెరలను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ విధిగా దోమ తెరలను ఉపయోగించుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలని సూచించారు. వర్షాకాలం కావడం వల్ల ప్రతి ఒక్కరు సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలోని పేదలకు,అభాగ్యులకు అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని అన్నారు. పేద గిరిజనుల ఆరోగ్య రక్షణలో భాగంగా వారికి దోమతెరలు అందించినందుకు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ అభినందించారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ..ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం గొప్ప మానవత్వం అని పేర్కొన్నారు. దోమ తెరలతో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో తమ ఫౌండేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై పీవీఎన్ రావు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.