— రేపాకుల శ్రీనివాస్.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.
గోల్డెన్ న్యూస్ /బూర్గంపాడు: మతతత్వ రాజకీయాలు భారత దేశానికి పెను ప్రమాదంగా మారాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ తెలిపారు, గురువారం నాడు మండల కేంద్రంలో రెండు రోజుల మండల స్థాయి సిపిఎం రాజకీయ శిక్షణా తరగతులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి ప్రారంబించారు, ప్రారంభ సూచికగా సిపిఎం జెండా ను సీనియర్ నాయకులు షేక్ జానీమియా ఆవిష్కరించారు, “మతతత్వ రాజకీయాలు- నేటి కర్తవ్యం “అనే అంశాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ బోధించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం అనేది ప్రజల జీవన విధానంలో భాగంగా ఉందన్నారు,ప్రజల మతాన్ని రాజకీయాలకు ఉపయోగించడం రాజ్యాంగ విరుద్దమని ఆయన విమర్శించారు, కేంద్రంలో అధికారం లో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు, మత తత్వాన్ని పెంచుతూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బిజెపిని గద్దె దించాలన్నారు, మతం ముసుగులో అదికారంలోకి వచ్చి దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుందన్నారు,సిపిఎం మతానికి వ్యతిరేకం కాదని,మత ఉన్మాదానికి వ్యతిరేకం అన్నారు, ప్రజా సమస్యల పై , మతోన్మాదం పై రాజీలేని పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు,
జనతా ప్రజాస్వామిక విప్లవ సాదనే ధ్యేయం
ఎంబి నర్సారెడ్డి .
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.
“సిపిఎం విశిష్టత -అఖిల భారత మహాసభ”నిర్ణయాలు అనే అంశాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి బోధించారు, ఆయన మాట్లాడుతూ భారత దేశంలో జనతా ప్రజాస్వామిక విప్లవం సాధనకు కార్మిక, కర్షక ఐక్యతతో వర్గ పోరాటాలు ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ శిక్షణా తరగతులకు సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు, ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు భయ్యా రాము రాయల వెంకటేశ్వర్లు పాండవుల రామనాథం SKఅబిదా కందుకూరి నాగేశ్వరావు శ్రీశైలం శ్రీనివాస నాగమణి తదితరులు పాల్గొన్నారు