గోల్డెన్ న్యూస్ /చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అభివృద్ధిలో అభివృద్ధి పథలో ముందుకు దూసుకెళ్తుంది . ప్రజలు మంత్రి సీతక్కను ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు.మండలంలోని కేశవాపురం పంచాయతీ పరిధిలోని రాళ్లగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన చింత ఫిలిం స్టేషన్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క శుక్రవారం ప్రారంభించారు. అనంతరం లక్ష్మీ కాలనీలో రూ. 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని కూడా ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెహబూబాబాద్ లోక్‌సభ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మంత్రి వెంట ఉన్నారు.
చర్ల రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ప్రతీ గిరిజన కుటుంబం అభివృద్ధి పథంలోకి రావాలి. ఇందిరమ్మ ఇండ్ల ద్వారా గిరిజనులు సుస్థిర నివాసాలను కలిగి అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.