గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం చుట్టూ ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తెలంగాణలో కలపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి తుమ్మల కోరారు. పోలవరం ముంపు కింద వీటిని ఏపీలో కలిపారని, దీనివల్ల పాలనాపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. అభివృద్ధికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. భద్రాచలం ఆలయ భూములు ఏపీలో కలవడంతో వాటి నిర్వహణకూ ఆటంకాలు వస్తున్నాయన్నారు.
Post Views: 36