గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : రెక్కాడితేకాని కడుపు నిండని ఆ నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి వరుణ్ ప్రాణాపాయ స్థితితో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చెప్పాల గ్రామానికి చెందిన జాడి నవీన్, వరలక్ష్మి దంపతుల కుమారుడు వరుణ్ తేజ్ (4) ప్రమాదవశాత్తు థమ్సప్ అనుకోని గడ్డి మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్నాడు. నవీన్ కూలి పని చేస్తూ కుటుంబ పోషణ చేస్తున్నారు. తల్లిదండ్రు తమ శక్తిమేరకు హైదరాబాద్ నీలోఫర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించినా ఇంకా కుదుట పడలేదు.మెరుగైన వైద్యం అవసరం ఉందని వైద్యులు సూచించారు. ఆర్థిక స్థోమత లేక పోవడంతో చిన్నారి చికిత్సకు దాతలు సహాయం చేయాలని ఓ దళిత కుటుంబం వేడుకుంటుంది (చరవాణి నంబరు 7032943748) .