గోల్డెన్ న్యూస్ / రంగారెడ్డి : మైలార్ దేవ్ పల్లి కాటేదాన్ పారిశ్రామిక వార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నేతాజీ నగర్ లోని తిరుపతి రబ్బర్ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి . ఘటన స్థలానికి నాలుగు ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను ఆర్పుతున్నాయి.దట్టమైన పొగలు వ్యాపించడంతో మంటలు ఆర్పేందుకు ఇబ్బంది అవుతోంది. రబ్బరు ఎక్కువగా ఉండటంతో మంటలు మంటలు అదుపులోకి రావడం లేదు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
Post Views: 13