పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండలంలోని కొత్తూరు వలస ఆదివాసి గ్రామము, చొప్పలా గ్రామము లో మండల పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం నిర్వహించారు. ఈ సందర్భంగా  విద్యార్థిని ,విద్యార్థులకు పలకలు మరియు పుస్తకాలు అందజేశారు. అనంతరం ఏడుల్లబయ్యారం సిఐ  మాట్లాడుతూ.. మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని.గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు.అభివృద్ధి నిరోధకులైన నిషేధిత సిపిఐ మావోయిస్టులకు ఎలాంటి సహాయ,సహకారాలు అందించకూడదని సూచించారు.ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసు వారికి తెలియజేసి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని తెలిపారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు.అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించవద్దని తెలిపారు.మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని అన్నారు. యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు.అసాంఘీక శక్తులకు సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా కేసులు,జైలు పాలు కావద్దని సూచించారు. కార్యక్రమంలో. ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావ్ మరియు స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram