గోల్డెన్ న్యూస్ / నిజాంపేట : మద్యం తాగి వచ్చి నిత్యం తనను వేధిస్తున్నాడనే కారణంతో ఓ ఇల్లాలు భర్తను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ ఘటనను సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు ఆమె చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
భర్త అంజిలప్పను హత్య చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించిన రాధ.. అంత్యక్రియల కోసం భర్త మృతదేహాన్ని మహబూబ్ నగర్కు తీసుకెళ్లిన రాధ.. అంజిలప్ప గొంతుపై మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులు.. పోలీసుల విచారణలో అంజిలప్పను తానే చంపినట్లు ఒప్పుకున్న భార్య రాధ.. రాధను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన బాచుపల్లి పోలీసులు…
Post Views: 38