⇒స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా పనిచేయండి –
⇒రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య..
⇒12 మందితో నూతన కమిటీ ఎన్నిక..
⇒మండల కార్యదర్శిగా వంగరి సతీష్..
⇒మండల మహాసభలో పలు తీర్మానాలు..
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం :ప్రజల పక్షాన నిలిచే ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. కరకగూడెం మండలం కేంద్రాల్లోని సిపిఐ పార్టీ మండల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వందేళ్ళ చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని వారన్నారు. కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలిచే పార్టీలని ప్రజల సమస్యలపై ఎవరితోటైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి జిల్లా కి తెలియజేయాలని వాటిని పరిష్కారం అయ్యే విధంగా జిల్లా నాయకత్వం ప్రత్యేక ఉద్యమాలు చేపడుతుందని అన్నారు. గ్రామాలలో పోడు సమస్య సమస్య పోలేదని కోడు కొట్టుకున్న ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలు వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని వారు అన్నారు. గెలిచే అంతవరకు నాయకులు చూపెట్టి గెలిచిన తర్వాతల దాని ఊసే ఎత్తడం లేదని వారన్నారు. అవినీతిలో చిక్కుకున్న నాయకులను ఊరవతలకి తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఎర్ర జెండా ప్రతి పేదోడికి అండగా ఉంటుందని అన్నారు. చివరి రక్తం బొట్టు వరకు ప్రజల సంక్షేమం కొరకు వారి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఎర్ర జెండా ఉంటేనే భూస్వాములు పెత్తందారులు ఆటలు కొనసాగవని అన్నారు. స్థానిక సంస్థలు మన ప్రాతినిధ్యం ఉండే విధంగా కార్యచరణ రూపొందించుకోవాలని ఒత్తులో భాగంగా పంచాయతీలో ఎర్రజెండా ఎగురవేయాలని వారి కోరారు. కేంద్ర ప్రభుత్వం మే డే స్ఫూర్తిని దెబ్బతీస్తూ 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మికుల నడ్డి విరూస్తుందని రేపు జరిగే సార్వత్రిక సమ్మెలో సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. ప్రతి ఆదివాసి గ్రామాలలో అభివృద్ధిలో ఉంది అంటే దానికి ఎర్రజెండా అండగా ఉందని అన్నారు. గిరిజన నాయకులు గిరిజనులను నిర్లక్ష్యం చేస్తూ వారికి అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తున్నారని అన్నారు. అనంతరం 12 మందితో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కరకగూడెం మండల కార్యదర్శిగా వంగరి సతీష్, సహాయ కార్యదర్శిలుగా బోడ ముత్తయ్య, బుడుగం సతీష్, కమిటీ సభ్యులుగా 12 మందిని ఎన్నుకున్నారు. మూడోసారి మండల కార్యదర్శి ఎన్నికైన వంగరి సతీష్ ను జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అభినందించారు. ఈ సమావేశానికి ఉన్న లక్ష్మీ కుమారి, సరే రెడ్డి పుల్లారెడ్డి,మండలంలో వలస ఆదివాసీలు నాయకులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.