గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: రాష్ట్రంలో యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. వేలకు వేలు జీతాలు వస్తోన్న అడ్డదారుల్లో లంచాలు తీసుకుంటున్న అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారిణి చిక్కారు. పని మీద వచ్చిన ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
ఫిర్యాదిధారునికి చెందిన ఒక కంపెనీకి జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ చేసి నెంబరును పొందడానికి గల ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.8,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్‌లోని మాధాపూర్ ప్రాంతపు ఉప రాష్ట్ర పన్నుల అధికారి – ఎం. సుధ.
Post Views: 30