గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం :
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 34. 9 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. స్నాన ఘట్టాల వద్ద మెట్ల వరకు వరద నీరు చేరాయి. భక్తులు లోతుకు వెళ్లకుండా నది ఒడ్డునే స్నానాలు ఆచరించాలని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
Post Views: 15