గోల్డెన్ న్యూస్/ జూలూరుపాడు : అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ ఐ ఎస్ ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జూలూరుపాడు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ అనేక సమస్యలు ఉన్నాయని . కొన్ని హాస్టల్లో లో వార్డెన్లు ఉండకుండా 40 నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని. సమయ పాలన కూడా పాటించడం లేదని ఆరోపించారు. దీనికి కారణం ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపమే అని అన్నారు. సమస్యలు నిలయంగా ఉన్న వసతి గృహాలను ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి హాస్టల్లకు పర్మినెంట్ వార్డులను ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా వ్యవస్థలు అనేక సమస్యలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక్కుని రెట్టినట్టు వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో గదులు లేక అనేక సమస్యలతో విద్యార్థుల అవస్థలు పడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం లేదని, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సమస్యను పరిష్కరించలేని ఎడల పెద్ద ఎత్తున అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యక్ష విద్యార్థి ఉద్యమాలకు సిద్ధం అవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు సాయి తేజ నాయకులు రామ్ చరణ్ తేజ, అనిల్ కుమార్, హేమంత్, తదితరులు పాల్గొన్నారు
