మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క

సమస్య తెలిసి, నేనున్నానని భరోసా కల్పించిన సీతక్క .

 

గోల్డెన్ న్యూస్ / హనుమకొండ :ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం (మేడారం) గ్రామానికి చెందిన గజ్జెల రవి స్వాతి దంపతుల కుమారుడు శ్రీరామ్ ఇటీవల కిడ్నీ, లివర్ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు

మెరుగైన వైద్యం కోసం లక్షల్లో నగదు అవసరం అవుతుండడంతో శ్రీరామ్ తల్లి స్వాతి దాతల సాయం కోరింది

ఈ విషయం వాట్సాప్ ద్వారా తెలిసిన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు శ్రీరామ్ కు అవసరమైన వైద్యం వ్యక్తిగతంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు…

కాగా చిన్నారి శ్రీరామ్ ఇప్పటికే ఎంజీఎం లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో… సీతక్క  పిఏ సంతోష్ చిన్నారి శ్రీరామ్ ను మరిన్ని వైద్య పరీక్షల కోసం హనుమకొండ లోని గ్రావిడ్ హోమ్ పిల్లల ఆస్పత్రి డా. ప్రదీప్ వద్దకు తీసుకోని వెళ్లి.. మరిన్ని వైద్య పరీక్షలు చేయించారు.

వైద్య పరీక్ష అనంతరం వైద్యులు చిన్నారి శ్రీరామ్ కి పిత్తాశయంలో మూడు రాళ్లు, సికెల్ సెల్ ఎనీమియా (రెండు మూడు నెలలకు ఒకసారి రక్తం తగ్గిపోవడం) అనే అరుదైన వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క వైద్యులు, మరియు బాధితులతో వీడియో కాల్ మాట్లాడారు.

అనంతరం మంత్రి సీతక్క చిన్నారి శ్రీరామ్ కు అవసరమైన ఉన్నత వైద్యం హైదరాబాద్ లో అందిస్తామని హామీ ఇచ్చారు.

తనతో పాటు తన సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటూ అవసరమైన సాయం అందిస్తామని, వైద్యానికి, ఇతర అవసరాలకు సాయం అందిస్తానని భరోసానిచ్చారు. 

చిన్నారి శ్రీరామ్ తో సైతం మంత్రి సీతక్క మాట్లాడారు… నేను ఉన్నా… నువ్వు కోలుకుంటావు, బాగా చదువుకోవాలి, మీ ఇల్లు ఎక్కడ, అమ్మానాన్న ఎవరు అని పలు కుశల ప్రశ్నలు అడిగారు… 

సోమవారం ఉదయం చిన్నారి శ్రీరామ్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకొని రావాలని తన సిబ్బంది కి మంత్రి సీతక్క  సూచించారు…

 

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram