లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : నగరంలోని పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కనకరత్నం ఏసీబీకి చిక్కారు. డీఈని బదిలీ చేసేందుకు కనకరత్నం రూ. 50వేలు డిమాండ్ చేశారు. సరిగ్గా ఆ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఆయన పదవీ విరమణ చేయగా.. ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram