కొత్త రేషన్ కార్డుల పంపిణీ.

వాజేడు, వెంకటాపురం మండలాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ.

గోల్డెన్ న్యూస్ /వెంకటాపురం : ములుగు జిల్లా వెంకటాపురం మరియు వాజేడు మండలాల్లో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను శనివారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు లబ్ధిదారులకు అందజేశారు. వెంకటాపురం మండలంలో 551 కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా, వాటిలో 2 వేల 391 కుటుంబ సభ్యులు నమోదు అయ్యారు. వాజేడు మండలంలోని రైతు వేదికలో 953 కార్డులు పంపిణీ చేయగా, వాటిలో దాదాపు 2 వేల మందికి పైగా కుటుంబ సభ్యులు యాడ్ చేయబడ్డారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) మహేందర్ జి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram