లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్

గోల్డెన్ న్యూస్ / సిద్ధిపేట : జిల్లాలోని  ములుగు మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ యెలగందుల భవాని పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుని బంధువు పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేయడానికై వేసిన దరఖాస్తును ప్రాసెస్ చేయాలంటే రూ.2,00,000/- లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారుని నుంచి ఈ మేరకు సమాచారాన్ని అందుకున్న అనంతరం ACB అధికారులు విచారణ చేపట్టి యెలగందుల భవానిపై కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి నివారణకు కట్టుబడి ఉన్నట్లు అనిశా అధికారులు తెలిపారు. ఈ సందర్భంలో

వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు:

ఎవైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram