గోల్డెన్ న్యూస్ / ఆదిలాబాద్ : తమ పోడు భూములు లాక్కుంటున్నారని అటవీశాఖ, పోలీసు అధికారులపై రాళ్ల దాడి చేసిన ఆదివాసీలు.
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో అటవీశాఖ అధికారులకు, ఆదివాసీలకు మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన పోడు భూముల వ్యవహారం.
గత కొన్ని రోజులుగా పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటుతుండగా, వాటిని పీకేస్తున్న ఆదివాసీలు
ఆ భూములు తమవే అని, భూములు లాక్కోవాలని చూస్తే అదే భూమిలో ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను హెచ్చరించిన ఆదివాసీలు
దీంతో ఆదివారం భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులు, పోలీసుల పై ఒక్కసారిగా రాళ్లతో దాడి చేసిన ఆదివాసీలు
దాడిలో గాయపడిన 9 మంది పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులుగాయాల పాలైన ఫారెస్ట్ సిబ్బందికి ఇచ్చోడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం వరకు ఇచ్చోడా మండలం సిరి చెల్మ అటవీ ప్రాంతంలోనీ పలు గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హుటాహుటిన పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.