గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయంది.
Post Views: 130