ఒక్క ఆలోచన ఇప్పుడు పవిత్ర కార్యక్రమంగా మారింది.

గోల్డెన్ న్యూస్ / వరంగల్ :బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారి పిలుపు మేరకు గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా – ఏనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో వరంగల్ రీజనల్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 100 మంది విద్యార్థిని, నిరుద్యోగులకు వివిధ పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్, కుర్చీలు, స్టడీ ప్యాడ్స్, ఫ్యాన్లు, లైబ్రరీకి ఉపయోగకరమైన సామాగ్రిని అందజేయడం జరిగింది.

 

జూలై 24 కేటీఆర్  పుట్టినరోజు కంటే ” గిఫ్ట్ ఎ స్మైల్ ” అనే ఒక సేవా పర్వదినంగా మారింది.

 

నాయకుల పుట్టినరోజు నలుగురికి ఉపయోగపడేలా ‘ గిఫ్ట్ ఎ స్మైల్ ‘ పిలుపునిచ్చి కేటీఆర్ ఒక రోల్ మోడల్ ను నెలకొల్పారు.

 

అధికారం, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, కార్యకర్తల్లో, అభిమానుల్లో రామన్న నింపిన ఈ స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శాన్ని అందిస్తుంది.

 

 కేటీఆర్  పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం రోజు గులాభి సైనికులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరో ప్రజల జీవితాల్లో ” స్మైల్స్ ను” నింపుతుంది.

 

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు ఆ భద్రకాళి అమ్మవారి నిండైన ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు తోడై నిండు నూరేళ్ళు ఆయురాగ్యాలతో వర్ధిల్లాలని మరోసారి భవిష్యత్ తెలంగాణ ఆశాకిరణం  కల్వకుంట్ల తారక  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేశారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram