జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.

వచ్చే వారం జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు

గోల్డెన్ న్యూస్ /ఖమ్మం : జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు. గురువారం  ఖమ్మం జిల్లాలోని వైరాలో టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) నాల్గో జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

 

వచ్చేవారంలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి

 

వచ్చేవారంలో అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో యూనియన్ నాయకులతో చర్చించి ఫైనల్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత వెంటనే హెల్త్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉండటంతో న్యాయ నిపుణులతో చర్చించి ఎలాంటి ఆటంకం కలగకుండా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మాటిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు. జర్నలిస్టులకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు..

Facebook
WhatsApp
Twitter
Telegram